పార్లమెంటరీ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కోదాడ నవంబర్ 18(విజయక్రాంతి): రెండు రోజులుగా బెంగళూరులో నిర్వహిస్తున్న తొలి కామన్వెల్త్ పార్లమెంటరీ ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్లో(Parliamentary India Region Conference) తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(Kodad MLA Padmavathi Reddy) పాల్గొన్నారు.
ఈ కాన్ఫరెన్స్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, శాసన వ్యవస్థల బలోపేతం, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చట్టసభల పాత్ర వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయనిని పద్మావతిరెడ్డి పేర్కొన్నారు.
ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, వారి అనుభవాల ద్వారా పలు నూతన విషయాలను తెలుసుకునే అవకాశం లభించిందని పద్మావతి రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, శాసన వ్యవస్థల పటిష్టత, సమర్థవంతమైన పాలన దిశగా ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు ఎంతో విజ్ఞానదాయకంగా, దోహదకరంగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.