ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్
ఏన్కూర్ నవంబర్ 18 విజయక్రాంతి: ఏన్కూరు మండల(Enkuru Mandal) పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల(Government Tribal Ashram High School) మూలపోచారం పాఠశాలను ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.ఫిరంగి(M. Firangi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను(Classrooms), స్టోర్ రూమ్ ను, విద్యార్థులకు(Students') అందించే నిత్యావసర సరుకుల నిల్వలను(Stockpiling of essential goods) క్షుణ్ణంగా పరిశీలించారు.సరుకుల నాణ్యత,నిల్వ వివరాలు, ఎక్స్పైరీ తేదీలను తనిఖీ చేయడంతో పాటు పాఠశాల నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనమును(Lunch) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినారు. ఆశ్రమ పాఠశాలలో(Ashram School) మెనూ అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ భద్రాచలం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉద్దీపకము -3, వారధి ప్రత్యేక తరగతులను స్వయంగా పరిశీలించారు.తరగతి గదిలో విద్యార్థుల సమక్షంలో కూర్చొని ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని, విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై వారి అభ్యాసన స్థాయిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో వారధి ప్రత్యేక తరగతులు ఎంతో కీలకమైనవని, ప్రతి విద్యార్థి అభ్యసన సామర్ధ్యాలను పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
విద్యార్థులలో ప్రాథమిక అభ్యసన సామర్ధ్యాలు బలోపేతం కావడానికి వారధి తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పాఠశాల విద్యా ప్రగతి విద్యార్థుల అభ్యాసన ఫలితాలు పాఠశాల అభివృద్ధి విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పన తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో పని చేస్తూ పాఠశాలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపాలని ఆకాంక్షించారు.
పాఠశాలలో విద్యాబోధన వారధి ప్రత్యేక తరగతుల నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, నిత్యావసర సరుకుల నిల్వల పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ పాఠశాల నిర్వహణ పట్ల ఉపాధ్యాయుల కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు,డిప్యూటీ వార్డెన్ డిఎస్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు కే.శ్యామల,బి.రవి,ఎం. చందర్రావు,పాయం. శ్రీనివాస్,బి.వసంత దేవి,బి.సింగ్య, బి.సక్రామ్,బి.రవి,బోడ సక్రాం,డి.వెంకటరమణ, ఉషశ్రీ,మరియు నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.