వేడెక్కుతున్న స్పాట్అడ్మిషన్ డిమాండ్

18-11-2026 | 08:09pm

రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే మేడిపల్లి 

చర్చలు విఫలం

దీక్షలు కొనసాగుతాయన్న జేఏసీ నాయకుడు లింగంపల్లి మహేష్ 

కరీంనగర్ క్రైం, నవంబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) ప్రధాన గేటు ఎదుట గత ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు(Relay hunger strikes) చేస్తున్న యూనివర్సిటీ జేఏసీ నాయకులకు(University JAC leaders) చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం(Medipalli Satyam) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డితో(Higher Education Chairman Balakrishna Reddy) మాట్లాడి, లాసెట్, పీజీసెట్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను బుధవారం సాయంత్రంలోగా శాతవాహన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌కు పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జేఏసీ నాయకులకు భరోసా ఇచ్చారు. తదనంతరం శాతవాహన యూనివర్సిటీ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న జేఏసీ నాయకులు చర్చలు విఫలం అయినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు లింగంపల్లి మహేష్ మాట్లాడుతూ యూనివర్సిటీలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ పెట్టాలని కోరుతుండగా, సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

నిరాహార దీక్షలకు పోలీసుల అనుమతి తీసుకొని మరీ పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. అర్హులైన విద్యార్థులకు చదువు అందించాలంటే స్పాట్ అడ్మిషన్ పెట్టడం తప్పనిసరి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్, యోగి, మణిచరణ్, రాణి, మమత, దివ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు