పేద ప్రజలకు "ఆసరా" పింఛన్లు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
ఆసరా పింఛన్లు పంపిణీ
బెల్లంపల్లి: పేద ప్రజలకు ఆసరా పింఛన్లు(Aasara Pensions) అండగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రకటించిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampalli MLA Gaddam Vinod) అన్నారు. పట్టణంలోనీ ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో బుధవారం నియోజక వరం స్థాయి లో నూతనంగా చేపట్టిన పింఛన్లు పంపిణీ కార్యమక్రంలో ఆయన అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య(Additional Collector P. Chandrayya) కలసి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses), పింఛన్ల కొరకు దళారులను నమ్మవద్దన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే గా తాను ఉన్నానన్నారు. ఏదైనా సమస్య ఉంటే క్యాంపు కార్యాలయానికి రావాలన్నారు. అందుబాటులో ఉంటాననీ, నేరుగా ప్రజలు కలవచ్చనీ తెలిపారు.
బెల్లంపల్లినియోజకవర్గంలో 2929 మంది మహిళలకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆసరా పెన్షన్ మహిళా లబ్ధిదారులందరినీ గ్రామాలకు వచ్చి కలుస్తానాని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తున్నానీ వెల్లడించారు. ప్రజలు ఆదరి ఆదరిస్తున్నారుకనుకనే అభివృద్ధి పనులు చేస్తున్నాన్నారు. రాజకీయపరంగా ఏ పార్టీని ఎవరిని విమర్శించనాని,అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్, వైస్ చైర్మన్ రాగం శెట్టి సత్యనారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, మున్సిపల్ కమిషనర్ రమేష్ ఎంపీడీవో మహేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు చింతల వసంత, నీలి హారిక, డి కొండ పద్మావతి, ఇప్ప కుమారస్వామి, కొక్కుల రామ్మూర్తి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాదవరపు నర్సింగరావు,బండి ప్రభాకర్, చిలుముల శంకర్,రుద్రభట్ల సంతోష్, గట్టు మురళీధర్ రావు,సర్పంచులు గోమాస శ్యామలత, ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.