పెన్షన్లు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 18, విజయ క్రాంతి: వెంకటాపురం ,మండలం పాత్రపురం గ్రామపంచాయతీ (Patrapuram Gram Panchayat) పరిధిలోని రైతు వేదికలో బుధవారం,రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా,హాజరైనభద్రాచలం.
నియోజకవర్గశాసనసభ్యులు ,డాక్టర్ తెల్లం వెంకట్రావు మండలంలోని 501 మంది లబ్ధిదారులకు మంజూరైన పెన్షన్లు .స్మార్ట్ రేషన్ కార్డులను స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ పీఏసీ ఎస్ చైర్మన్ మోహన్ రావు జిల్లా కాంగ్రెస్ లీడర్ మన్యం సునీల్ బాబు యువనాయకులు బాలసాని వేణు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిట్యాల సాగర్ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప -సర్పంచ్ లు , కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.