షోకజ్ నోటీస్ ను వెనక్కి తీసుకోవాలి

18-11-2026 | 08:10pm

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు

బెజ్జూర్, నవంబర్ 18 ( విజయ క్రాంతి ): కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయ(Kasturba Gandhi Residential School) పిఈటి పై విడుదల చేసిన షోకాస్ నోటీసును(Showcase Notice) వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అర్షద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయ విద్యార్థులు ఆందోళన చేస్తే పీఈటీకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఏంటి అని ఆయన అన్నారు. ఆందోళన గల కారణాలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు వారన్నారు. ముఖ్యంగా ఈ ఆందోళనకు బెజ్జూర్ పాఠశాల ఎస్ ఓ పై చర్య తీసుకోవాలని అన్నారు.ఆదివాసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎస్ఓను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి వై ఎం జిల్లా ఉపాధ్యక్షులు  ఉమ్మెర బాలకృష్ణ, సల్మాన్, హరీష్ షణ్ముఖ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు