డిసెంబర్ 9న చలో హైదరాబాద్ కార్యక్రమం

14-11-2026 | 03:53pm

ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద కరపత్రాల ఆవిష్కరణ

ఇంద్రవెల్లి,(విజయక్రాంతి): ఆదివాసీల హక్కుల(Adivasi rights) సాధన, ఆదివాసీ అస్తిత్వ పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల అమలు లక్ష్యంగా డిసెంబర్ 9న హైదరాబాద్‌లో నిర్వహించనున్న లక్షలాది ఆదివాసీల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి(Tribal Rights Struggle Committee) తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిసెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ  సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కాపుల నాగరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపురావు పాల్గొని మాట్లాడుతూ.. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మిది తెగల ఆదివాసీ ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, ఆదివాసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లోరగల్ జెండా కమిటీ చేర్మెన్ మెస్రం నాగనాథ్, రాష్ట్ర నాయకులు సలాం వరుణ్, తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి పూర్కా చిత్రు, విద్యార్థి సంగం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ కనక గణేష్, తుడుం దెబ్బ జిల్లా ఉప అధ్యక్షులు గేడం భరత్, TAGS జిల్లా అధ్యక్షులు ఉయిక విష్ణు, తుడుం దెబ్బ డివిజన్ నాయకులు జూగ్నక్ భరత్, తుడుం దెబ్బ ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు మాడవి కోసేరావ్, తుడుం దెబ్బ ఉట్నూర్ అధ్యక్షులు సోయం శంకర్, తుడుం దెబ్బ ఉట్నూర్ సాంసృతిక కార్యదర్శి దుర్వ జైవంత్, విద్యార్థి మండల అధ్యక్షులు గేడం లాలు ప్రసాద్, రాజగోండ్ సేవా సమితి మండల అధ్యక్షులు పెందుర్ గణేష్, ASU వర్కింగ్ ప్రసిడెంట్ పూర్కా నాగేష్, ASU ఉప అధ్యక్షులు ఆత్రం రమేష్, తుడుం దెబ్బ మండలం కార్యదర్శి కుంర భీమ్ రావ్ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు