బాలల హక్కులు, సంక్షేమంపై బాల గ్రామసభ
సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ అధ్యక్షతన కార్యక్రమం
జడ్చర్ల: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు బాలల స్నేహపూర్వక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. బాలల సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు, సంక్షేమం, కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ టి.భాస్కరాచారి అంగన్వాడీ విద్యార్థులకు కుర్చీలు,పండ్లు పంపిణీ చేశారు. ఆయన చేస్తున్న సేవలను సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలు క్రమశిక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఆరోగ్యం, అభివృద్ధి గ్రామంతో పాటు దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ పావని అనిల్ కుమార్, వార్డు సభ్యురాలు చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి బాలచందర్, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, పార్వతమ్మ, డీలర్ కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, నరేందర్, జగదీష్, శ్రీనివాసులు, నితీష్, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.