దొడ్డి కొమురయ్య సినిమా పోస్టర్ ఆవిష్కరణ
పాలేరు నియోజకవర్గం నుంచి 32 మంది సహనిర్మాతలకు సన్మానం
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా రెండో వాల్ పోస్టర్ను ఆదివారం (నవంబర్ 15) కూసుమంచిలో ఆవిష్కరించనున్నట్లు సినిమా సహనిర్మాత దామళ్ళ భాస్కర్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ, అనంతరం ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో పాలేరు నియోజకవర్గం నుంచి సినిమా నిర్మాణంలో భాగస్వాములైన 32 మంది సహనిర్మాతలకు శాలువాలు కప్పి ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కళాకారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్మాణ కమిటీ కోరింది.