కారముంగి పాఠశాలను సందర్శించిన నోడల్ అధికారి

21-11-2026 | 12:46pm

నాగల్‌గిద్ద, నవంబర్ 21 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని కారముంగి ఎంపీపీఎస్ (MPPS) పాఠశాలను నోడల్ అధికారి యశ్వంత్ తన బృంద సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల (School) నిర్వహణ, విద్యాబోధన (Teaching Methods), విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఆయన చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు (Teachers) అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు.

మరిన్ని వార్తలు