కురవిలో వీరభద్ర స్వామి మాలాధారణ
21-11-2026 | 12:43pm
కురవి: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో భక్తులు మాలాధారణ (Mala Dharana) చేపట్టారు. నీలిరంగు వస్త్రాలు ధరించి స్వామివారిపై భక్తితో మండల కాలం పాటు దీక్ష (Spiritual Deeksha) కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా దీక్షాదారులు శీతలస్నానం, భూతలశయనం, సాత్విక ఆహారం, ప్రాతఃకాల పూజలు, రాత్రి నివేదన పూజలు వంటి నియమాలను (Spiritual Discipline) నిష్ఠగా పాటించనున్నారు. అల్పాహార నియమాలను కూడా ఆచరిస్తూ స్వామివారి సేవలో తరించనున్నారు. ఏటా వీరభద్ర స్వామి మాలాధారణ చేపట్టే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.