అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం

18-11-2026 | 07:45pm

బోథ్. నవంబర్ 18 (విజయ క్రాంతి,) అర్హులైన పేద వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను(Congress government welfare schemes) అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వపరంగా మంజూరైన నూతన పెన్షన్ సందర్భంగా గీతా కార్మికుడు గంగారం ఇంటికి వెళ్లి పెన్షన్ మంజూరు పత్రాన్ని అందించడం జరిగింది.

అంతేగాక అర్హులైన మహిళల వద్దకు వెళ్లి పెన్షన్ మంజూరి పోస్టింగ్ కాఫీలు అందించారు ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ల కోసం అర్హులైన వారు ఎదురు చూసి విసిగిపోయారని మాట అయితే ప్రజల ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి పరులకు పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తాము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెన్షన్ ఎట్టకేలకు రావడంతో హర్షం పరిచారు .కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మెరుగు భోజన్నఆత్మ చైర్మన్ రాజు యాదవ్,

ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్ ఉపసర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు సుద్దల అరుణ్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్రార్ మాజీ రాష్ట్ర రెడ్ క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి త్రే నారాయణ సింగ్ వార్డు సభ్యులు పద్మారావు సాహెబ్ చందు ఎండి సద్దాం మౌలానా వంశీ శరత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు