సొంత నిధులతో బోరు వేయించిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు
చించోడ్ అభిమన్యు రెడ్డి.
రాజాపూర్ నవంబర్ 18: మండలంలోని బీబీనగర్ తండా(Bibi Nagar Thanda) గ్రామ పంచాయతీలోని సేవ్యా నాయక్ తండా లో మంచినీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడటంతో గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కల్పించెందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చించొడ్ అభిమన్యు రెడ్డి తన సొంత నిధులు వెచ్చించి బోర్ డ్రిల్లింగ్ చేయించారు. బుధవారం బోరు మోటర్ ను బిగించి మోటార్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో లాంటి విపత్కర పరిస్థితిలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నీటిని మరింత పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన తండాలో బోరు వేయించి అభిమన్యు రెడ్డిని తాండవాసులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, ఉప సర్పంచ్ వినోద్ నాయక్, మాజీ సర్పంచ్ గోవింద్ నాయక్, రాంసింగ్ నాయక్, పాల్గొన్నారు.