ఎస్సీ మహిళను వేధించిన ఒకరిపై కేసు నమోదు..
* ఎస్సీ మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఫోటోలు అప్‌లోడ్ చేసిన నిందితుడి అరెస్ట్...
* నిందితుడికి రిమాండ్..
* ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే..
ఉట్నూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఇచ్చోడ పోలీస్ స్టేషన్(Ichchoda Police Station) పరిధిలో ఎస్సీ(మాంగ్) కులానికి చెందిన మహిళను నిందితుడు ప్రఫుల్ దత్తాజీ బేజవార్ @ బేజ్జరావర్ ప్రఫుల్ @ నాని (33), బీసీ వర్గానికి చెందిన వ్యక్తి వేధించినట్లు ఫిర్యాదు చేయడంతో పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే తెలిపారు.
ఏఎస్పి తెలిసిన వివరాల ప్రకారం మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి వలస వచ్చి పిచ్చోడా మండల కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీ నివాసముంటున్నారని అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో నివాసం ఉండే ఎస్సీ (మాంగ్) కులానికి చెందిన మహిళ ను గత కొంతకాలంగా వేధిస్తూ, ఫోన్‌లో మాట్లాడాలని బెదిరించడమే కాకుండా, మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి ఆమె ఫోటోలను అప్‌లోడ్ చేసి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇతర సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ రోజు ఉట్నూర్ ఏ.ఎస్.పి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు.
ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలపై వేధింపులు, కులం ఆధారంగా అవమానించడం, సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడటం వంటి చర్యలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.