బీఆర్ఎస్ నాయకుడికి ఎమ్మెల్యే పరామర్శ

25-11-2026 | 11:22pm

ఎల్బీనగర్, నవంబర్ 25: కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకుడు గౌరిదేవి రాజును బుధవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) పరామర్శించారు. చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ పాత గ్రామానికి చెందిన గౌరీదేవి రాజు మంగళవారం సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో నాగోల్ మార్గమధ్యంలో అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పికి గురయ్యారు.

దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. రాజు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటనే స్పందించి గుండెపోటుగా అనుమానించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న రెడ్డి కామినేని ఆసుపత్రికి వెళ్లి రాజుని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకుడు ఉమా మహేశ్వరరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు