పల్లెచెరువును పరిశీలించిన అధికారులు

25-11-2026 | 11:04pm

చిన్నంబావి, నవంబర్ 25: మండల పరిధిలోని వెల్టూరు గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లకు నీరు రాకపోవడంతో రైతులకు సాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పల్లె చెరువును చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్ ను కోరగా అయన రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) దృష్టికి గ్రామ రైతుల సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశిస్తూ గ్రామ పల్లె చెరువు పునరుద్ధరణకు ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం నీటిపారుదల శాఖ అధికారులు ఈఈ ప్రవీణ్ కుమార్, ఏఈ నాగర్షిత్, గ్రామంలోని పల్లె చెరువును పరిశీలించి, పునరుద్ధరణకు చేపట్టవలసిన చర్యలను నివేదిస్తామన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ పల్లె చెరువు పునర్నిర్మానం జరిగితే గ్రామ రైతులతోపాటుగా లింగసానిపల్లి, సోలిపురం గ్రామాలకు రైతులకు సమృద్ధి సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు టకా రెడ్డి, పల్లె మధు, ఆకుల నారాయణ, లక్ష్మీనారాయణ, రమేష్, ప్రకాష్, గోవిందు, నరసింహ, మద్దిలేటి, శివ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు