పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
డీ ఐ జీ ఎన్. శ్వేత
మహబూబాబాద్: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ తోపాటు పెండింగ్ కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇంచార్జ్ డీ ఐ జీ ఎన్. శ్వేత(DIG Shweta) పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డీఎస్పీ కార్యాలయం, కేసముద్రం పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని డీ ఐ జీ ఎన్.శ్వేత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీ ఐ జీ వివిధ అంశాలపై ఎస్పీ డాక్టర్ శబరిష్ తో కలసి సమీక్ష నిర్వహించారు.
నేర నియంత్రణ, పెండింగ్ కేసుల విచారణ, శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల దర్యాప్తులో నాణ్యత, నేరస్తులపై చట్టపరమైన చర్యల విషయాలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్, కేసముద్రం, తొర్రూర్, మరిపెడ సిఐలు సత్యనారాయణ, గణేష్, పవన్ కుమార్, ఎస్ ఐ లు క్రాంతి కిరణ్, మహేందర్ రెడ్డి, నరేష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.