యోగ క్లాస్ కు రమ్మంటే ఏలన చేసింది అందుకే కొట్టిందంటూ..

25-11-2026 | 10:54pm

పెంట్లవెల్లి మండల విద్యాధికారి జీవన్ కుమార్ ఆరోపించారు.. 

పెంట్లవెల్లి నవంబర్ 25: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం కేంద్రంలోని కేజీవీబీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ మంజుల ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రమీల జుట్టు వేసుకోవడం లేదని విద్యార్థిని కొట్టిన పాఠశాలను. పెంట్లవెల్లి మండల ఎంఈఓ జీవన్ కుమార్(MEO Jeevan Kumar) సందర్శించారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మండల ఎంఈఓ జీవన్ కుమార్ మాట్లాడుతూ.. మార్నింగ్ ఆరు గంటలకు యోగా క్లాసు ఉన్నది. యోగా క్లాస్ కు రమ్మంటే నన్ను వేళన చేసినందుకే డ్రెస్సు మంచిగా చేసుకోకుండా ఇన్ డిస్ప్లే గా ఉన్నందుకు ఇంగ్లీష్ టీచర్ మంజుల పైపు తీసుకుని రెండు దెబ్బలు కొట్టిందని ఆయన అన్నారు. జరిగిన ఘటనపై విద్యార్థులతో విద్యార్థితో చర్చించి పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎంఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేజీవీబీ ఎస్ ఓ .లత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు