పల్లెకు వచ్చిన అధికారాన్ని ప్రేమతో సాగనంపిన పంచాయతీ పాలకవర్గం
బోథ్. నవంబర్ 25 ( విజయక్రాంతి): శిక్షణలో భాగంగా సోనాల మండలంలో పర్యటించిన ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, అధికారులను సోనాల మండల గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం సముచిత గౌరవంతో సాగనంపారు. శిక్షణలో భాగంగా వచ్చిన అధికారులను మండలంలోని ఆదివాసి గుండెల ప్రజలతో పాటు మండల కేంద్రానికి చెందిన ప్రజలు గుండెల్లో పెట్టుకొని వారిని చూసుకున్నారు. శిక్షణలో భాగంగా వచ్చిన ఈ అధికార యంత్రాంగం అన్ని వర్గాల ప్రజల సాధకబాధకాలను నిషితంగా పరిశీలించడంతో పాటు వారికున్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి గమనించడం జరిగింది.
అయితే స్థానిక తాసిల్దార్ మల్లేష్, ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao)తో పాటు, గ్రామ సర్పంచ్ ఇయ్యాల బిందుజ సుధీర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి శీరల వెంకటరమణ వారికి దగ్గర ఉండి వసతులను కల్పించారు. ఐదు రోజులపాటు మండలంలో పర్యటించిన అధికారులు స్థానిక ప్రజల మనసును దోచుకున్నారు. అధికారులు సైతం ఈ ప్రాంత ప్రజలు చూపించిన ఆధార అభిమానులను మర్చిపోకుండా ఉన్నామని పేర్కొన్నారు. చివరి రోజున గ్రామపంచాయతీ సర్పంచ్ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సన్మానించి వారికి చిరు జ్ఞాపికలను అందించారు.
పల్లెకు వచ్చిన అధికారులను పంపించడం స్థానిక ప్రజలకు ఇష్టం లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో సాగనంపాల్సి వచ్చింది. భవిష్యత్తులో కలెక్టర్లుగా, కమిషనర్లుగా, ఎస్పీలుగా, డీఎఫ్వోలుగా విధులు నిర్వహించే వీరు ప్రజలతో కలిసి సామాన్య ప్రజలుగా ఉండడం స్థానికులు సైతం మర్చిపోలేవకుండా ఉన్నారు. ఇది ఏమైనా స్థానిక ప్రజల అభిమానం ఇచ్చిన మర్యాద వారు మరిచిపోరని అంటున్నారు.