మొక్కలకు కంచెలు ఏర్పాటు

22-11-2026 | 03:38pm

విజయక్రాంతి వార్తకు స్పందన 

బోథ్. నవంబర్ 22 (విజయక్రాంతి): బోథ్ రేంజ్ పరిధిలో నాటిన మొక్కలకు అటవీ శాఖ(Forest Department) అధికారులు ప్లాస్టిక్ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. 'మొక్కల పెంపకం గాలికి ముళ్ళ కంచెలే రక్షణ కవచం'అన్న వార్తకు అటవీ శాఖ అధికారులు స్పందించి మొక్కల చుట్టూ కాంచన ఏర్పాటు చేయడం జరుగుతున్నాది, దాదాపు స్థానికరేంజ్ పరిధిలో తొమ్మిది నెల వరకు మొక్కలు నాటినట్లు సమాచారం.

రెవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన ఈ మొక్కల లోనుండి 3000 వరకు మొక్కలు ఎదగడం లేదు. మొక్కలు నాటేటప్పుడు రెండు మీటర్ల ఎత్తులో ఉన్న మొక్కలు నాటినట్లు రికార్డులను బట్టి తెలుస్తుంది. మొక్కలు నాటి ఏడాది దాటిన మొక్కలు ఎదుగు బదులు లేకుండా ఉన్నాయి. మొక్కల చుట్టూ కలుపు మొక్కలు తీయకపోగా సరైన సమయంలో నీరు పోయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మొక్కల పెంపకంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు