ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి ప్రాణాలు తీసి పరార్

22-11-2026 | 11:13am

ముగ్గురు మహిళలు సహా నలుగురు మృతి!

పట్నా, నవంబర్ 22: బీహార్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Bihar Road Accident) చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్నా జిల్లాలోని బర్హ్ ప్రాంతం సబ్నిమా గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో ఈ Accident జరిగింది.

అథ్మల్‌గోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్ పెట్రోల్ పంప్ దగ్గర ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ Collision తీవ్రతకు కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. అయితే ప్రమాదానికి కారణమైన మరో వాహనం ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించినట్లు సమాచారం. ప్రమాదం చేసి వెళ్లిపోయిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు Search Operation చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు