చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఉప సర్పంచ్

22-11-2026 | 04:00pm

సిర్గాపూర్ నవంబర్ 22 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy district) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఉప సర్పంచ్ గూడూరి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని 5 సం" లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు