డయాబెటిక్ రెటినోపతి అవగాహనలో పాల్గొన్న ఎమ్మెల్యే
జగిత్యాల, నవంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నియో రెటీనా ఐ కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డయాబెటిక్ రెటినోపతి అవేర్‌నెస్ వాక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(MLA Dr Sanjay Kumar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం కారణంగా కంటి చూపుపై కలిగే ప్రభావాలు, డయాబెటిక్ రెటినోపతి సమస్యను ముందస్తుగా గుర్తించడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో వైద్య చికిత్స పొందడం యొక్క ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మధుమేహ బాధితులు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కంటి చూపును కాపాడుకోవడానికి నిరంతర వైద్య పరీక్షలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.