కారోబార్ రవి ఆరోపణలు అవాస్తవం
- బత్తుల రవి, వెంబడి సురేష్ వెల్లడి
- నకిలీ డెత్ సర్టిఫికెట్లు స్కాంకు
- మాజీ జెడ్పివైస్ ఛైర్మెన్, ఎంపీడీవోనే కారణం
బెల్లంపల్లి: నకిలీ డెత్ సర్టిఫికెట్(Fake Death Certificate Scam)ల వ్యవహారంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని, బూదాకుర్డ్ కారో బార్ చిలుముల రవి తమపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతిది బత్తుల రవి, కాంగ్రెస్ నేత వెంబడి సురేష్ లు స్పష్టం చేశారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నకిలీ సర్టిఫికెట్ల స్కాం కు మాజీ జెడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్ లే ప్రధాన కారణమన్నారు.
బూదా కుర్డ్ గ్రామ పంచాయంతిలో 16 సర్టిఫికెట్ లు జారీ కాగా వాటిలో ఎక్కువ సర్టిఫికెట్ లు మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ తొంగల సత్యనారాయణ బంధువులయేనాన్నారు. నకిలీ సర్టిఫికెట్ ల వ్యవహారంలో పోలీసులు చేస్తున్న విచారణకు తాము అన్నివిధాల సహకరిస్తామన్నారు. కారోబార్ రవి ని బయటకు తెచ్చేందుకు సత్యనారాయణ బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.
గ్రామ సర్పంచ్ మహిళ అయినప్పటికీ గ్రామభివృద్ధి ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ దుర్గం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే బంధువన్నారు. ఎంపీ డివో డ్రైవర్ అయిన చిలుముల రవి, బీ ఆర్ ఎస్ నాయకులైన అశోక్ గౌడ్, బూదా కుర్డ్ వార్డు సభ్యుడు ఎంబడి చంద్రశేఖర్ లు ఎంపీ డీ వోతో సంబంధాలు కలిగి ఉండి కారోబార్ చిలుముల రవి ద్వారా ఈ తతంగం నడిపిస్తిన్నారనీ వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బరిగెల రవి, మొకెనపల్లి బాలకృష్ణ, సల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.