ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో న్యాయం
ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో(SC classification roster points) అవలంభించిన విధానానికి వ్యతిరేకంగా, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన మెమో నెం 1628 రద్దు చేయాలని డిమాండ్ చేస్తు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం ఆదిలాబాద్ లో కలెక్టరేట్ ఎదుట ఒక రోజు రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో మాలలకు 10 లోపు ఒక రోస్టర్ పాయింట్ కేటాయించాలన్నారు.11 నుండి 20 లోపు ఒక రోస్టర్ పాయింట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మాలలకు 20 లోపు రెండు రోస్టర్ పాయింట్ లను కేటాయించాలన్నారు.ఇటీవల విడుదలైన ప్రభుత్వ మెమో నెం 1628 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి సుధాకర్, గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, సీనియర్ నాయకులు సింగరి అశోక్, మేదరి స్వామి, గైని ప్రకాష్, అసోసియేట్ అధ్యక్షులు పాశం రాఘవేంద్ర, ముచ్చ రఘు, సుభాష్ మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు చిలుక పొచ్చన్న, ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.