మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. ఒకరి ఆత్మహత్య
అప్పుల బాధతో ఇంటి వెనకాల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సతీష్
ఉట్నూర్,(విజయక్రాంతి): స్వయం ఉపాధి పొందుటకు మైక్రో ఫైనాన్స్ తో పాటు వారం వారం కిస్తీ రూపంలో కడితే అప్పులు ఇచ్చే వారి నుండి అప్పు పొంది వారి వేధింపులకు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన ఆదిమూలం సతీష్ (34) వృత్తి రీత్యా మంగలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో స్వయం ఉపాధి కొరకు బార్బర్ షాప్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. బార్ బార్ షాప్ ఏర్పాటుకు ఉట్నూర్ కేంద్రంగా పంపిణీ చేసే మైక్రో ఫైనాన్సు నుండి అప్పుగా తీసుకోవడంతో పాటు వారం వారం చెల్లించే విధంగా అప్పులు చేశారు.
మైక్రో ఫైనాన్స్ వారు వేధించడంతో అప్పులు చెల్లించలేక బుధవారం మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ఇంటి వద్దకు వస్తారని, గతవారం డబ్బులు చెల్లించకుంటే రోడ్డుపైన పరువు తీశారని తీవ్ర మనో వేదనకు గురై ఇంటి వద్దకు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వస్తే పరువు పోతుందని మనోవేదనకు గురై బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనకాల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంపై మృతుడి భార్య జయ ఫిర్యాదు మేరకు ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాడవి ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివరించారు.