ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలి

27-11-2026 | 06:56pm

మంత్రి, శాఖ కార్యదర్శిని కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, నవంబర్ 27( విజయక్రాంతి ): అదిలాబాద్ జిల్లాలోని  ఉట్నూర్ డివిజన్(Utnoor Division) పరిధిలోని గిరిజనులతో పాటు గిరిజనేతరులకు  వైద్య సేవలు అందించే ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను మంజూరు చేయాలని కోరుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్  రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  సి. దామోదర రాజనర్సింహ , ఆ శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు స్వయంగా కలిసి శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు.

ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్థోపెడిక్, గైనకాలజీ & ప్రసూతి, నేత్ర వైద్య, ప్రధాన మరియు  దంత వైద్య విభాగాలకు అవసరమైన పరికరాలను మంజూరు చేయాలని కోరారు. ఆసుపత్రి పరిధిలోని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈ పరికరాలు ఎంతో అవసరమని వివరించారు.

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజ్ఞప్తిపై మంత్రి  సి. దామోదర రాజనర్సింహ,ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు  సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైన వైద్య పరికరాల మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

మరిన్ని వార్తలు