రామకృష్ణ విద్యార్థుల ప్రభంజనం

27-11-2026 | 06:52pm

జగిత్యాల, నవంబర్ 27 ( విజయ క్రాంతి ): శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) నిన్న విడుదల చేసిన పీజీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాలలో స్థానిక రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ కనబరిచినారు. ఎమ్మెస్సీ బొటని విభాగంలో అప్సా జుహాన్ 7.70, అరుణ 7.54,

ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ విభాగంలో రుకాయ బత్తుల్ 7.63, గట్ల పావని 7.46, సనా కౌసర్ 7.41, ఎంఎస్సీ మ్యాథ్స్ విభాగంలో కొప్పు రమ్యశ్రీ 7.61, నల్లపు సుస్మిత 7.58, ఆకుల ఇందు 7.51, స్వర్గం పూజ 7.46, మర్రి మౌనిక 7.45 సాధించినారు. అన్ని కోర్సులలో శత శాతం ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పల్లెర్ల నరేష్, ప్రిన్సిపల్ కొక్కుల రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు