చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎదగాలి

14-11-2026 | 03:01pm

బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం

బోథ్,(విజయక్రాంతి): విద్యార్థులు(Students) చిన్ననాటి నుంచే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు(Sonala MPDO Ratnakar Rao) పిలుపునిచ్చారు. బాలల దినోత్సవాన్ని(Children's Day) పురస్కరించుకుని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో బాలల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో రత్నాకర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే తమ లక్ష్యాలను నిర్ణయించుకుని, వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యనభ్యసించి వారి కలలను సాకారం చేయాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు