ఈనెల 30లోగా ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లింపుకు అవకాశం
బోథ్. నవంబర్ 18 (విజయక్రాంతి): ఈనెల 30లోగా ఓపెన్ స్కూల్ ఫీజు(Open School Fee) చెల్లించి పరీక్షలకు(Examinations) సిద్ధం కావాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం సోనాల మండల(Sonala Mandal) కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో చదివి పరీక్షలు రాసినట్లయితే ఫలితాలను అందిస్తామన్నారు. ఓపెన్ స్కూల్లో చదివేందుకు అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు(Anganwadi workers and ASHA workers) ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఓవర్ శ్రీనివాస్ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అన్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.