విబిజి రామ్ జి పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

18-11-2026 | 05:30pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): వి బి జి రామ్ జి పథకంలో(VBG Ramji Scheme) అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో వి బి జి రామ్ జి పథకంలో నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం మండల కేంద్రంలోని గల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వి బి జి రామ్ జి పథకంలో సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెట్లు పథకంలో పనులు చేయకున్నా, కూలీలు హాజరు కాకున్నా హాజరైనట్లుగా నిధులు కాజేసారని ఫిర్యాదు రావడంతో కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు, ఎం.బి. బుక్కులను పరిశీలించగా నిధులు కాజేసినట్లు తేలడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఆపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు