సామ రూపేష్ రెడ్డిని సత్కరించిన కాంగ్రెస్ నాయకులు ....
బేల అక్టోబర్ 07(విజయక్రాంతి): ఈనెల 4న నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలలో (Indian Red Cross Society Election)సొసైటీ నూతన సభ్యునిగా 700 పైచిలుకు ఓట్లతో గెలిచిన సామ రూపేష్ రెడ్డిని బేల మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజసేవే మార్గంగా ఆలోచించే సామ రూపేష్ రెడ్డికి ఈ ఎన్నికల్లోను ఉద్యోగ ఉపాధ్యాయులు సైతం మద్దతు తెలిపి 764 ఓట్లను వేయడం ఆయన సేవను మరింతగా గుర్తు చేస్తుందని తెలిపారు.
రానున్న రోజుల్లోనూ మానవతా దృక్పథంతో మరింత సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాకలే రాందాస్,ఠాక్రె అశోక్,గట్లేవార్ రవి,ఆకాష్, రాజారెడ్డి, సవాపురే విలాస్, సాగర్,జీతేందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గున్నారు.