విద్యార్థులతో రైల్వే లైన్ కోసం లేఖ
బేల అక్టోబర్ 07(విజయక్రాంతి): ఆదిలాబాద్ నుంచి గడ్‌చందూర్ వరకు జైనథ్, బేల మీదుగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాల బేల విద్యార్థులతో సామ రూపేష్ రెడ్డి(Youth Congress leader Sama Rupesh Reddy) లేఖలు రాయించారు.
2009–10 రైల్వే బడ్జెట్‌లో మంజూరైన ఆదిలాబాద్–గడ్‌చందూర్ రైల్వే లైన్‌ను కొనసాగించి పనులు చేపట్టాలని కోరారు. జైనథ్, బేల మీదుగా వెళ్లే ఈ రైల్వే లైన్‌ను రద్దు చేసి గడ్‌చందూర్–ముకుడుబన్ వైపు లైన్‌ను మళ్లించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులతో లేఖలు రాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి పేర్కొన్నారు.