బెంగళూరులో ఫుట్‌పాత్‌పై ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు.. ఇద్దరికి గాయాలు
బెంగళూరు: నగరంలోని బాగ్లూర్ మెయిన్ రోడ్డు(Bagalur Main Road)పై అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అమెజాన్ కార్యాలయం(Amazon Office) సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ బాక్స్ ఒక్కసారిగా పేలింది. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు(Transformer Blast) ధాటికి ఓ వ్యక్తి చేతులకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ విద్యార్థిని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. రద్దీగా ఉండే ఫుట్‌పాత్‌లపై విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల(Electrical transformers)ను ఏర్పాటు చేయడం, వాటి భద్రతా ప్రమాణాలపై ఈ ఘటనతో మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాదచారులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఇలాంటి విద్యుత్ పరికరాల నిర్వహణ, రక్షణ చర్యలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌పాత్‌పై నడిచే వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఈ ఘటనతో మరోసారి ముందుకొచ్చింది.