ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

07-10-2026 | 03:45pm
  1. కిచ్చన్నపేట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం 
  2. రైతులకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటా

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 7 (విజయ క్రాంతి):మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) తాండూర్ కిచ్చన్నపేట పాలకవర్గం సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.సంఘ అధ్యక్షులుగా బొగుడమీది శ్రీధర్ గౌడ్తో పాటు ఆయా గ్రామాల నుండి డైరెక్టర్లను అసిస్టెంట్ రిజిస్టర్ లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో నూతన పాలకవర్గానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దాంట్లో భాగంగా ధర్మారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొగుడమీది శ్రీధర్ గౌడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాండూర్ కిచ్చన్నపేట్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

డైరెక్టర్లుగా భూమా భూపతి గౌడ్,మ్యాదరి లక్ష్మి,గూల శివరాములు,బెస్త పోచవ్వ, భూమిని చిన్న దుర్గయ్య, మునిగేపల్లి సంగయ్య, జంబికుంట జీవయ్య, బోరంచ సుశీల,కోర్ర వజ్రా నాయక్,లంబాడి తులూజా,కానాపురం నరసమ్మ,గడ్డం భాస్కర్ రెడ్డిలు ప్రమాణం స్వీకారం చేశారు.ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ...

రైతులకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసుకుంటామని,సంఘం అభివృద్ధి దేహంగా పనిచేస్తామని తెలిపారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాండూర్ కిచ్చన్నపేట పాలకవర్గం సభ్యులుగా ఎన్నికకు సహకరించి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి,మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ సురేందర్ గౌడ్,తాసిల్దార్ వెంకట్ రెడ్డి, సీఈవో చంద్ర మురళి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు,రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు