ఉపాధి హామీ పనుల ఆకస్మిక తనిఖీ....
సింగరేణి అక్టోబర్ 07విజయ క్రాంతి: సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా పరిషత్ ప్రాజెక్టు అధికారి శ్రీరామ్( Parishad Project Officer Sriram) ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్మిస్తున్న కమ్యూనిటీ సోక్ పీట్ పనులను పరిశీలించి నాణ్యత, పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. కూలీలకు భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.
పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో పద్మ ఆదేశించారు. గ్రామంలో పనుల సమస్యలను సర్పంచ్ దండు ప్రవీణ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెట్ ల వేతనాలు సకాలంలో చెల్లించాలని, అర్హులకు కొత్త పని హామీ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.