నవ లిమిటెడ్ నిర్మించిన కమ్యూనిటీ హాల్

07-10-2026 | 03:49pm

శేఖర్ బంజర లో ప్రారంభం

పాల్వంచ, అక్టోబర్ 7, (విజయక్రాంతి): నవ లిమిటెడ్,పాల్వంచ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(Corporate Social Responsibility) కార్యక్రమాలలో శేఖరం మంజూరులో  నిర్మించిన 'కమ్యూనిటీ హాల్ ను బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెడ్ -హెచ్.ఆర్  ఎ .శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నవ లిమిటెడ్ సి .ఎస్.ఆర్ కార్యక్రమాలు వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నవ లిమిటెడ్ చేపడుతున్న వైద్య,విద్య,జీవనోపాదులు మరియు ఇతర సంఘసేవ కార్యక్రమాలను కొని ఆడారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కార్పోరేషన్ మేయర్ ఎం.గణేష్, డిప్యూటీ మేయర్ ఎస్.లలిత కుమారి, నవ లిమిటెడ్ లైసెన్ ఆఫీసర్  సి.వి. ఎస్.మూర్తి, హెడ్ - సి ఎస్ ఆర్ డి.సుధాకర్,  బానోత్ బాలు నాయక్ 33 వ డివిజన్ కార్పొరేటర్, మున్సిపల్ కమిషనర్ పి.సుజాత, అధికారులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు