74 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కేరమేరి మండల తహసీల్దార్ కార్యాలయంలో 74 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం Financial Support అందిస్తుందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి(Calyaan Lakshmi) పథకం ద్వారా పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మారుసుకోలా సరస్వతి, మండల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు Beneficiaries పాల్గొన్నారు