ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత.. 24 గంటల నిఘా

07-10-2026 | 03:45pm
ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాము వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలతో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత తెలిపారు. బుధవారం ఆమె ఈవీఎం గోదామును తనిఖీ చేసి సీల్స్(Seals), సీసీ కెమెరాల పర్యవేక్షణ(CCTV Monitoring), భద్రతా రికార్డులను పరిశీలించారు. ఈవీఎం యంత్రాల భద్రత విషయంలో అన్ని చర్యలు పకడ్బందీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోదాము వద్ద Security ఏర్పాట్లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్యాంలాల్, సిబ్బంది ముసావీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు