క్యాన్సర్ నిరోధక ఔషధాలపై పరిశోధన ఇరాటి ఉదయశ్రీ కి పీహెచ్డీ
ఘట్ కేసర్, నవంబర్ 4 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీకి(Anurag University) చెందిన ఇరాటి ఉదయశ్రీ ఫార్మసీలో పీహెచ్డీ పట్టా పొందారు. క్యాన్సర్ నిరోధక ఔషధాల అభివృద్ధికి ఉపయోగపడే నూతన రసాయన సమ్మేళనాలపై ఆమె పరిశోధన నిర్వహించారు. డిజైన్ సింథసిస్ ఆఫ్ న్యూ బయో ఆక్టివ్ కాంపౌండ్ అస్ పొటెన్షియల్ లీడ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ అనే అంశంపై డాక్టర్ గంగారపు కిరణ్ పర్యవేక్షణలో ఆమె పరిశోధన పూర్తి చేశారు.
ఈ పరిశోధనలో నూతన జీవసక్రియాత్మక సమ్మేళనాలను రూపొందించి, వాటి క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని అధ్యయనం చేశారు. పీహెచ్డీ పట్టా పొందిన ఇరాటి ఉదయశ్రీ ని అనురాగ్ యూనివర్సిటీ చాన్సలర్ యు.బి. దేశాయ్, ఉపకులపతి ఆర్చనా మంత్రి, పరీక్షల విభాగం డీన్ డాక్టర్ ఈ. ముత్తా రెడ్డి, పరిశోధన, అభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ సతీష్ కుమన్నన్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సికిందర్ బాబా, ఫార్మసీ కళాశాల డీన్ డాక్టర్ వసుధ బక్షి, ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి.ఎస్. కుమార్, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు అభినందించారు. ఆమె మరిన్ని పరిశోధనలు చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.