అక్కంపల్లి తాండూర్ గ్రామాల్లో స్కిన్ డిసిజ్ టీకా కార్యక్రమం

04-11-2026 | 09:26pm

నాగిరెడ్డిపేట్,నవంబర్ 4 (విజయ క్రాంతి):మండలంలోని అక్కంపల్లి,తాండూర్ గ్రామాలలో లంపీ స్కిన్ డిసీజ్  టీకా కార్యక్రమం(Lumpy Skin Disease Vaccination Program) మరియు యాంటీ రాబిస్ టీకా కార్యక్రమం నిర్వహించబడిందనీ మండల పశువైద్యాధికారి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ...అక్కంపల్లి గ్రామంలో కుక్కలకు 6 టీకాలు వేయబడిందని తెలిపారు.అలాగే తెల్ల పశువులకు ఎల్.ఎస్.డి 85 టీకాలు వేయడం జరిగిందన్నారు.

తాండూర్ గ్రామంలో కుక్కలకు 55  టీకాలు వేయగా తెల్ల పశువులకు ఎల్.ఎస్.డి 68 టీకాలు వేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అక్కంపల్లి, తాండూర్ గ్రామాల సర్పంచులు వెంకా గౌడ్, యాదా గౌడ్,మండల పశువైద్యాధికారి రవి కుమార్ పంచాయతీ కార్యదర్శులు కిష్టయ్య కార్తీక్ కిష్టయ్య, విఏ విజయ, ఓ.ఎస్లు గౌస్, గంగారామ్,జయరాజ్ శునకాల యజమానులు మరియు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు