సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్
06-10-2026 | 06:32pm
దమ్మపేట, అక్టోబర్ 06 విజయ క్రాంతి): దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) ఆదేశాల మేరకు సర్పంచ్ పగడాల రమాదేవి, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు ఆరుగురు లబ్ధిదారులకు రూ.2,02.000/- రెండు లక్షల రెండు వేల రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంగళవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తులూరి వెంకట రామారావు, చిన్నశెట్టి యుగంధర్, చిట్టిబాబు, పగడాల రాంబాబు, ఇంచార్జీ కార్యదర్శి కొల్లు దుర్గారావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, గ్రామస్తులు పెరుమాళ్ళ కృష్ణమూర్తి, చిన్నశెట్టి గోపి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.