అమరుల ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి
ములకలపల్లి,నవంబర్ 9 (విజయక్రాంతి): సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ(Martyrs' Commemoration Meeting) రాచన్నగూడెం పంచాయతీ పరిధిలో పద్దం లక్ష్మణ్ రావు(Paddam Lakshman Rao) అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నాయకులు,గ్రామ ప్రజలు ఘన నివాళులు అర్పించారు. ఈ సభకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్, మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ పాల్గొని మాట్లాడారు.
జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ మాట్లాడుతూ అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి మనకు దారి చూపించారు.పేదలు,గిరిజనులు,రైతులు,కూలీల హక్కుల కోసం వారు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది.వారి ఆశయాలను కొనసాగించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ మాట్లాడుతూ అడవి - జలం - జమీన్ కోసం,భూమి భుక్తి కోసం,స్వేచ్ఛ కోసం అమరులైన వీరుల త్యాగాల వల్లే నేడు మనం ఈ హక్కులు అనుభవిస్తున్నాం.
యువత అమరవీరుల స్ఫూర్తితో ముందుకు రావాలి.గ్రామాల్లోని సమస్యలపై అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ సభలో రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ,మూకమామిడి సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మీ,ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేశ్,పార్టీ మండల నాయకులు నకిరికంటి నాగేశ్వరరావు,బండారు నాగేంద్రబాబు,పి వై ఎల్ నాయకులు గడ్డం వెంకటేష్ గ్రామ నాయకులు మడివి సోనయ్య,మడకం రవి,కోవాసి రాజు తదితర గ్రామాల పార్టీ ముఖ్య కార్యకర్తలు,మహిళలు,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు.