అతిథి బిర్యానీ సెంటర్లో కస్టమర్లపై దాడి
కత్తితో పొడిచిన ఘటనలో హోటల్ యజమాని, సిబ్బందిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు
ఎల్బీనగర్ , నవంబర్ 9 : బీఎన్ రెడ్డి నగర్‌లోని(BN Reddy Nagar) అథిథి బిర్యానీ సెంటర్(Athithi Biryani Center) వద్ద భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్లకు, హోటల్ సిబ్బందికి(To customers and hotel staff) మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు(Intense conflict) దారితీసింది. నవంబర్ 8వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో బడేటి రమేశ్ గౌడ్ తన స్నేహితులు మల్లేశ్, శివ, రాకేశ్ తో కలిసి హోటల్‌కు వెళ్లారు. భోజనం సిద్ధం కావడానికి సమయం పడుతుందని సిబ్బంది చెప్పడంతో వారు హోటల్లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది.
అనంతరం వారు బయటకు వెళ్తున్న సమయంలో అంజిబాబు, అతని కుమార్తె, అల్లుడు మరికొందరిని పిలిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో జరిగిన దాడిలో మల్లేష్ కుడి కంటి పైభాగంలో, వీపు వెనుక భాగంలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్ గౌడ్‌పై కూడా దాడి చేసి, బీర్ బాటిల్‌తో చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపించారు.
ఈ ఘటనలో రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల మూడు మొబైల్ ఫోన్లు కిందపడగా రెండు మాత్రమే తిరిగి లభించాయి. రమేష్ గౌడ్ జేబులో ఉన్న రూ.25 వేల నగదు కూడా కనిపించకుండా పోయింది. గాయపడిన వారిని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- తమపై దాడి చేశారని బాధితుల ఆరోపణ
తమపై అతిధి బిర్యాని యజమానితో పాటు కూతురు, అల్లుడు మరియు సిబ్బంది విచక్షణ రైతంగా తమపై దాడి చేసి కత్తులు, బిర్యాని గంటలకు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. తమపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.