'సదర్'లో విషాదం

09-11-2026 | 10:52pm

ఎల్బీనగర్‌లో 16ఏళ్ల బాలుడు మృతి

ఎల్బీనగర్, నవంబర్ 9 ‌: ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్(LB Nagar Police Station) పరిధిలో సోమవారం నిర్వహించిన సదర్ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులో(Sahara Road, Mansoorabad Division) సదర్ ఉత్సవాలు(Sadar Utsavs) నిర్వహిస్తున్నారు. కాగా, యాదవ్ సదర్ ఉత్సవాల్లో దున్నపోతును(Buffalo) ఆడిస్తూ 16 ఏళ్ల బాలుడు పోచబోయిన భవాని శంకర్(Pochaboyina Bhavani Shankar) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఆల్ ఇండియా యాదవ మహాసభ ఉపాధ్యక్షుడు పోచబోయిన గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు