పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
లక్ష్మీదేవిపల్లి, నవంబర్ 3,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని 6వ బెటాలియన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) మంగళవారం నాడు సందర్శించారు. సిబ్బంది సంక్షేమం, సౌకర్యాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించనున్న మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా బెటాలియన్ సిబ్బందికి కల్పిస్తున్న వసతులు, చేపట్టనున్న నూతన నిర్మాణాల గురించి కమాండెంట్‌తో చర్చించారు. సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా పోలీసు శాఖ పనితీరును మరింత బలోపేతం చేయవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ పి.సి.వి. రమణ, అదనపు కమాండెంట్ ఎస్. శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్లు ఎ.వి. రమణయ్య, రామకృష్ణ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు జె. లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.