యూత్ పార్లమెంట్ వాల్ పోస్టర్ విడుదల

03-11-2026 | 06:37pm

చివ్వెంల, నవంబర్ 3 (విజయక్రాంతి): మై భారత్ కేంద్రం సూర్యాపేట నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈనెల 4న సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్(Viksit Bharat Youth Parliament) 2026–27 వాల్ పోస్టర్‌ను ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి వెంకటేశ్వర్లు, మై భారత్ జిల్లా ఇన్‌చార్జ్ దిగురటి వెంకట భవాని ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ రణజిత్ పిచ్చిరెడ్డి పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించేందుకు యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు