పెంట్లవెల్లి బంగారం షాపుల్లో గోల్మాల్: తరువు పేరుతో ప్రజలను మోసం.?

03-11-2026 | 06:39pm

కొల్లాపూర్ నవంబర్ 3: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో బంగారం షాపుల్లో గోల్మాల్ జరుగుతుంది. స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి బంగారంకు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఈ బంగారు కొనడానికి కొల్లాపూర్ నియోజక వర్గంలోని చిన్నం బావి కోడేరు. పెంట్లవెల్లి. వీపనగండ్ల. వనపర్తి నుంచి కూడా వచ్చి ఆంధ్ర రాయలసీమ వాసులు  కృష్ణానది బోటు ప్రయాణంలో ద్వారా వచ్చి పదుల సంఖ్యలో బంగారును కొనుగోలు చేస్తుంటారు. 

కానీ బంగారు షాప్ యజమానులు గోల్డ్ పై ఆల్ మార్క్ చేయకుండా బంగారును  విక్రయిస్తున్నారని ప్రజల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదిలా ఉండగా  ప్రజలు బంగారు తీసుకొని ఆరు నెలలు తర్వాత సంవత్సరం తిరగకముందే మళ్లీ రిటర్న్ వేసి వేరే గోల్డ్ కొందామనుకుంటే తరుగు ఎక్కువగా పోతుందని సగానికి సగం తీసివేస్తున్నారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే బంగారు షాప్ యజమానులు ఇష్టం వచ్చినట్టుగా తరువు తీయడమే కాకుండా ఆల్ మార్క్ లేకుండా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం లక్షల 40 వేల నుంచి లక్ష యాభై వరకు ఉంటే పేద ప్రజలు వారి ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు