వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన
మహా ముత్తారం అక్టోబర్ 3 (విజయక్రాంతి): మంగళవారం మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం రైతు వేదికలో వ్యవసాయ శాఖ-ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, ఎల్నినో(El Nino) ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగుపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలైన పప్పు దినుసులు, కూరగాయలు, నూనె గింజలు తదితర పంటలను యాసంగి సాగు చేయాలని సూచించారు.
నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. 50 శాతం సబ్సిడీపై సూడోమోనాస్ అందుబాటులో ఉంది దీనిని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అజ్మీరా ధరమ్ సింగ్, మండల వ్యవసాయ అధికారి జి.అనూష, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్ శివకృష్ణ ,ఆర్. శశివర్ధన్, ఆర.ప్రవళిక, రైతులు తదితరులు పాల్గొన్నారు.