ఉచిత మెగా వైద్య శిబిరం

28-10-2026 | 04:07pm

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జారె

దమ్మపేట, అక్టోబర్ 28(విజయ క్రాంతి): రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) జన్మదినాన్ని పురస్కరించుకుని దమ్మపేట మండల కేంద్రంలోని వినాయక ఫంక్షన్ హాల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

రాష్ట్ర మాజీ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు సారథ్యంలో వారి కుమారుడు ధనుష్ ప్రణవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇటువంటి శిబిరాలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ముందుగా మందలపల్లి సాయిబాబా మందిరంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ తర్వాత మందలపల్లి సెంటర్‌లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు